ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్…లిక్విడ్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో 3-9 తరగతుల విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ శిక్షణనిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం కోసం ‘లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడెంట్స్ కు టోఫెల్ శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్, ఈ-కంటెంట్ ను ఉచితంగా అందించడంతోపాటు టీచర్లు, అధికారులకు లిక్విడ్ సంస్థ శిక్షణనివ్వనుంది. ఇది ఇలా ఉండగా…టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ‘విద్యార్థులు నవంబర్ 10లోగా ఫీజు చెల్లించాలి. 11వ తేదీ నుంచి 16 వరకు రూ. 50 పెనాల్టీతో ఫీజు చెల్లించవచ్చు. 17 నుంచి 22వ తేదీ వరకు రూ. 200, 23 నుంచి 30వ తేదీ వరకు రూ. 500 లేట్ ఫైన్ తో ఫీజు చెల్లించాలన్నారు ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి.