ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి దసరా సెలవులు

Diwali Special: Holidays for schools and colleges for 3 days from today
Diwali Special: Holidays for schools and colleges for 3 days from today

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు ఈ దసరా హాలిడేస్ కొనసాగనున్నాయి. స్కూలు తిరిగి ఈనెల 25వ తేదీన తెచ్చుకుంటాయి.

కాగా ఇప్పటికే పాఠశాలలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు నిర్వహించి మరియు ఫలితాలు కూడా వెల్లడించారు. ఇక రేపు నుంచి పాఠశాలలకు సెలవులు ఉండటంతో విద్యార్థులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలని కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు.

కాగా, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇవాల్టి నుంచి దసరా, బతుకమ్మ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో మొన్నటి వరకు పరీక్షలు ముగిశాయి.