ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..వచ్చే ఏడాది వరకు వయోపరిమితి పొడిగింపు

Good news for AP people… 5 lakh more houses for Sankranti
Good news for AP people… 5 lakh more houses for Sankranti

ఏపీ నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల వయో పరిమితి గడువును పొడిగించిన జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నాన్-యూనిఫామ్ పోస్టుల వయోపరిమితిని గతేడాది 32 నుంచి 42 ఏళ్లకు పెంచింది.

ఈ పెరుగుదల ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగియగా… వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సిఎస్ జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. ఏపీపీఎస్సీ సహా ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు చేపట్టే నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

కాగా, రేపు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సామర్లకోటలోని జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొనున్నారు. రేపు ఒకేరోజు 5 లక్షల ఇళ్లు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు పేదల చేతికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇళ్లు అందించనున్నారు .