నిరుద్యోగ భృతి విషయంలో మరో శుభవార్త…!

Good News For Unemployment Benefit

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఫిక్స్ చేసిన ప్రభుత్వం, ఇక నిరుద్యోగ బృతి అప్ప్లై చేసుకోవడానికి నిర్ధిష్టమైన గడువు ఏమీ లేదని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ప్రకటించింది. ప్రతి నెలా ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను నెలాఖర్లో 25వ తేదీలోగా పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా రూపొందించాల్సిందిగా మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆధార్ అనుసంధానం విషయంలో కొందరికి ఇబ్బందులు ఎదురవడంతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడంలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు తేదీని పూర్తిగా చెరిపివేసింది.

youva-nestam
పథకం ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే 2 లక్షల మంది నిరుద్యోగ భృతికి అర్హులుగా నిలిచినట్లు మంత్రి స్పష్టం చేశారు. అక్టోబర్ 2న ఉండవల్లి ప్రజావేదికలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నప్పటికీ.. ఆరోజున మహాత్మా గాంధీ జయంతి కారణంగా సెలవుదినం కావడంతో.. అక్టోబర్2న కాకుండా అక్టోబర్3న నిరుద్యోగుల ఖాతాల్లో రూ.1000 జమ చేస్తామని మంత్రి లోకేశ్ వివరించారు. యువనేస్తం పథకానికి 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1.8లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇప్పటి వరకు 1.54 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అలాగే ఇప్పటి వరకు 88 వేల ఫిర్యాదులు రాగా, వాటిలో దాదాపు 58 వేలు పరిష్కరించారు.

YOUVANESTAM-CM