గుడ్ న్యూస్ : ఓటీటీలో కి వచ్చేసిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..!

Good news: "Gangs of Godavari" has come to OTT..!
Good news: "Gangs of Godavari" has come to OTT..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి అలాగే అంజలి ల కలయికలో దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. అయితే ఈ మూవీ ఎప్పుడో గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సింది అలా ఆలస్యం అవుతూ వచ్చి ఈ వేసవిలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ థియేటర్లు లోకి వచ్చిన కేవలం రెండు వారల్లోనే ఓటీటీలో వచ్చేసింది.

Good news: "Gangs of Godavari" has come to OTT..!
Good news: “Gangs of Godavari” has come to OTT..!

ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ నేటి నుంచే అందుబాటులోకి వచ్చేసింది. మరి తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో ఈ మూవీ ఇప్పుడు అందుబాటులో ఉన్నది . మరి ఈ మూవీ ని అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇక ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి అందరికి తెలిసిందే.