గుడ్ న్యూస్ : ప్రభాస్ ‘స్పిరిట్‌’ పై తాజా అప్డేట్….. !

Good news: Latest update on Prabhas' 'Spirit'..... !
Good news: Latest update on Prabhas' 'Spirit'..... !

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘దేవర’ టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్‌’ అనే మూవీ చేయబోతున్నారు . ఈ క్రేజీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అని అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే, కథ, స్క్రీన్ ప్లే పూర్తి చేసిన సందీప్ రెడ్డి, ప్రస్తుతం డైలాగ్స్ పూర్తి చేసే పనిలోనే ఉన్నాడట.

Good news: Latest update on Prabhas' 'Spirit'..... !
Good news: Latest update on Prabhas’ ‘Spirit’….. !

‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న మూవీ రాబోతుందని టాక్. అలాగే, సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ వైల్డ్ ఎలిమెంట్స్ మూవీ లో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడని బాగా టాక్. పైగా ఇప్పటికే, ఈ మూవీ లో ప్రభాస్ పవర్ ఫుల్ మాఫియా డాన్ గా కనిపిస్తాడని, ముఖ్యంగా ప్రభాస్ పాత్రలోని డెప్త్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. దాదాపు రూ.400 కోట్లకి పైగా బడ్జెట్‌ తో ఈ మూవీ తెరకెక్కనుంది.