జంట నగరాల ప్రజలకు మరో గుడ్న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్ రైళ్ల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 11వ తేది నుంచి నగరంలో మరో 86 ఎంఎంటీస్ రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. అలాగే రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చేసినట్టు పేర్కొంది.
తాజాగా ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్లు రాకపోకలు సాగించనున్నట్టు స్పష్టం చేసింది.అయితే, గతంతో ఉదయం 6 నుండి రాత్రి 11.45 వరకు రాకపోకలు రైళ్లు నడిచేవి. అలాగే, సీజనల్ టికెట్స్ను సైతం సౌత్ సెంట్రల్ రైల్వే మళ్ళీ అందుబాటులో తీసుకువచ్చింది.