గుడ్ న్యూస్ : “డబుల్ ఇస్మార్ట్” మూవీ టీజర్ కు టైమ్ ఫిక్స్!

Good news: Time fix for
Good news: Time fix for "Double Smart" movie teaser!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డబుల్ ఇస్మార్ట్ (Double ismart). ఈ మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది . మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ పై మరో అప్డేట్ అందించారు మేకర్స్. రేపు ఉదయం 10:03 గంటలకి టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు ఇస్మార్ట్ శంకర్ మూవీ సెలబ్రేషన్ వీడియో ద్వారా వెల్లడించారు.

Good news: Time fix for "Double Smart" movie teaser!
Good news: Time fix for “Double Smart” movie teaser!

85 సెకన్ల నిడివి తో ఉన్న టీజర్ మాస్ ఆడియెన్స్ కు ట్రీట్ కానుంది. ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ ట్రీట్ పై అందరిలో ఆసక్తి నెలకొన్నది . ఇది రామ్ పోతినేని ప్యూర్ మ్యాడ్ నెస్ తో ఉండనుంది అని మేకర్స్ హామీ ఇస్తున్నారు. రామ్ ని మరోసారి మాస్ మేకోవర్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ మూవీ లో కీలక పాత్రల లో నటిస్తున్నారు.