మహిళలకి శుభవార్త చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

మహిళలకి శుభవార్త చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలకు మరో పేరు అని అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే  ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జిల్లాస్థాయిలో 50శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఏపీ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ను ప్రారంభించారు. ఏపీ ఆప్‌కాస్‌ వెబ్‌సైట్‌ను కూడా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్ 50శాతం ఉద్యోగాలు మహిళలకు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు ప్లేస్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వనున్నట్టు సీఎం జగన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్‌ కార్పోరేషన్‌ను ప్రారంభిస్తున్నామని, పొరుగు సేవల ఉద్యోగాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొస్తున్నామని, జీతం ఇచ్చేటప్పుడు ఉద్యోగులను మోసం చేయకుండా, మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వివరించారు. పొరుగు సేవల ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది ఉండాలని, అంతేకాకుండా జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఆయన అన్నారు.

ఈ మేరకు ఆయా శాఖాధిపతుల కమిటీ నుంచి డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితా రావాలని, జనవరి 1 నుంచి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంపై ఏపీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.