ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రైతులు అందరు కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న తరుణంలో, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులందరికీ కూడా తాజాగా ఒక శుభవార్త చెప్పారు. కాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చనున్నారు. కాగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2వేలు జమ చేయడానికి వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పీఎం కిసాన్ కింద రైతులకు రావాల్సిన భరోసా సొమ్మును, రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల అకౌంట్లలో డబ్బు వేయనున్నారు.
ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా అధికారులు మాట్లాడుతూ… సుమారు 46,50,629 మంది ఖాతాలకు, మొదటి విడత రైతు భరోసా ద్వారా రూ.1,082 కోట్లను బదిలీ చేయనున్నామని తెలిపారు. ఇకపోతే పంట పొలాలను సాగు చేసేవారు, కౌలు పంట రైతులు, ఇతర అధికార భూములను సాగు చేస్తున్నవారు, ఇతర పంటలు పండించే రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బు అందించనున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా ఈ పథకానికి సంబందించిన లబ్ది దారుల పేర్లను శుక్రవారం నుండి గ్రామ సచివాలయంలో పెట్టనున్నారు.