ఏపీకి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 178 కోట్ల నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం ఈ ఏడాది 4,333 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీకి ఫిబ్రవరి 3వ తేది వరకు ఉపాధి హామీ వేతనాలకు సంబంధించి 178 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఏపీ సీం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమరావతి, మండలి రద్దుతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజభన హామీల అమలుతో పాటు పలు అంశాలను మరోసారి సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం.