పసిడి ప్రేమికులకు తీపికబురు

పసిడి ప్రేమికులకు తీపికబురు

పసిడి ప్రేమికులకు తీపికబురు. బంగారం ధర వెలవెలబోతోంది. పసిడి నేలచూపులు చూస్తోంది. బంగారు ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. బుధవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.61 శాతం పడిపోయింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.47,330కు తగ్గింది. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర 0.46 శాతం క్షీణించింది. దీంతో కేజీ వెండి రేటు రూ.62,930కు తగ్గింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.27 శాతం దిగొచ్చింది. దీంతో బంగారం ధర 1784 డాలర్లకు పడిపోయింది. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 23.60 డాలర్లకు చేరింది.

కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.