రాష్ట్రంలోని పేదల కోసం మరొక శుభవార్త

రాష్ట్రంలోని పేదల కోసం మరొక శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి రాష్ట్ర ప్రజలందరికి కూడా ఉపయోగపడేలాగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, ప్రజలందరికి కూడా సంక్షేమమైన పాలనను అందిస్తున్నటువంటి సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా రాష్ట్రంలోని పేదల కోసం మరొక శుభవార్త తీసుకొచ్చారు. అయితే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సీఎం జగన్ ఒక్కొక్క పనిని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజల మెప్పు పొందుతున్నారు. కాగా సీఎం జగన్ తాజగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పై నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో భాగంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.

ఇకపోతే రానున్న ఉగాది పండగ లోపు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించాలని ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అమ్మఒడి తరువాత చేపడుతున్న అతిపెద్ద కార్యక్రమం ఇదే కావడంతో, ఈ పథకానికి అర్హులైన వారందరికోసం క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరపనున్నారని సమాచారం. ఇకపోతే అందరికి ఉపయోగపడే స్థలాలు ఇవ్వాలని, ఉపయోగం లేని చోట స్థలాలను ఇవ్వకూడదని, ఏదైనా కూడా లబ్ది దారులు ఆమోదం తెలిపితేనే వారికి అందజేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.