ఎవర్ గ్రీన్ కామెడీ షో “జబర్దస్త్”

ఎవర్ గ్రీన్ కామెడీ షో “జబర్దస్త్”

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్వించే ఎవర్ గ్రీన్ కామెడీ షో “జబర్దస్త్” లేటెస్ట్ ఎపిసోడ్ తాలూకా ప్రోమో బయటకు వచ్చింది.ఈ ప్రోమోలో కూడా అదిరిపోయే పంచులు మరియు హిలేరియస్ స్కిట్లు ఉన్నాయి.ఇక ఈ ప్రోమోను గమనించినట్లయితే రోజా గారిని ఆది కిడ్నాప్ చేసేసాడు.తాము వేస్తున్న పంచులను ఆవిడే ముందు వేసేస్తున్నారని కిడ్నాప్ చేశామని అన్నప్పుడు కూడా వారిపై పంచులు వెయ్యడం ఆపలేదు.

అంతే కాకుండా తన శంకర్ దాదా ఎంబీబీఎస్ స్పూఫ్ స్కిట్ లో మేఘన పై ఆది వేసిన పంచులు అలాగే వెంకీ మంకీస్ స్కిట్ లోని ఫన్ మంచి హ్యూమర్ ను పుట్టించింది.అలాగే అలాగే చివరగా గాలిపటాల సుధాకర్ స్కిట్ లో తన భార్య తో మాట్లాడిన కాన్వర్జేషన్ మరియు సత్తిపండు స్కిట్ లో తన ఎర్రి పప్ప తమ్ముడుతో పడే బాధలు మంచి హిలేరియస్ గా వచ్చాయి.అనసూయ భరద్వాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కిర్రాక్ కామెడీ షోకు రోజా మరియు ప్రముఖ గాయకులు మనో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ ఎపిసోడ్ ను మిస్సవ్వకుండా చూడాలి అంటే వచ్చే జనవరి 30 గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో చూడండి.