కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు

కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. టీడీఎల్పీ సమావేశాన్ని మరొక రెండు రోజుల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు… కాగా మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి చెందిన నేతలందరితో కలిసి ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నటువంటి వైసీపీ అరాచకాలపైన ఈ సమావేశంలో కీలకమైన చర్చ జరపనున్నట్లు సమాచారం.

ఇకపోతే ప్రభుత్వ రాక్షస పాలనను దిక్కరించడానికి ప్రత్యేకంగా ప్రణాళికలను రచిస్తూ, వ్యూహరచన చేస్తామని చంద్రబాబు వాఖ్యానించారు. అంతేకాకుండా “ధర్మం, న్యాయం అల్టిమేట్ గా గెలుస్తుంది. అధర్మం, అన్యాయం తాత్కాలికం. అభివృద్ధి ఆకాంక్షించే ఏ వ్యక్తి అయినా మూడు రాజధానులను ఎక్కడా సపోర్టు చేయడు” అని వాఖ్యానించారు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.