రాజకీయంలో తనదైన ముద్ర వేస్తున్న రజనీకాంత్

రాజకీయంలో తనదైన ముద్ర వేస్తున్న రజనీకాంత్

తమిళనాడు రాజకీయం మొత్తం పెరియార్ భావజాలంతో నిండి ఉంటుంది. డీఎంకే, అన్నాడీఎంకే రెండూ.. పెరియార్ భావజాలంతో ఉన్నవే. ఇప్పుడు.. రజనీకాంత్.. రాజకీయాల్లో స్పేస్ కోసం.. భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. పెరియార్‌ను వ్యతిరేకిస్తూ.. ఆయన రాజకీయంగా తనదైన ముద్ర వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పెరియార్ భావజాలంలో దేవుళ్లకు చోటు లేదు. యాభై, అరవై ఏళ్ల కిందట.. తమిళనాడులో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. మూఢనమ్మకాలు, దేవుళ్లకు వ్యతిరేకంగా ఉద్యమమే నడిచింది.

పెరియార్‌ దీనికి నేతృత్వం వహించారు. అప్పట్లో పెరియార్‌ను.. నూతన శతానికి ప్రవక్తగా యునెస్కో ప్రశంసించింది మూఢ నమ్మకాలకు ఆయన వ్యతిరేకం అర్థం లేని సంప్రదాయాలను ఆయన తిరస్కరించారు. అయితే ఇప్పుడు జనరేషన్లు మారిపోయాయి. పెరియార్ భావజాలంతో ఏర్పడిన పార్టీలు కూడా.. అభిప్రాయాల్ని మార్చుకోకపోయినా… అములలో మాత్రం ఫ్లెక్సిబులిటీ చూసుకుంటున్నాయి. దేవుళ్లను అప్పట్లా వ్యతిరేకించడం లేదు. కానీ బహిరంగంగా చెప్పలేరు. ఈ పరిస్థితి రజనీకాంత్ ఉపయోగించుకుటున్నట్లుగా కనిపిస్తోంది.

గత వారం.. ఆయన పెరియార్.. దేవుళ్ల విగ్రహాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారని.. ప్రకటించారు. అది వివాదాస్పదమయింది. ఆయనపై కేసులు నమోదైనా.. వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాడులో పరిస్థితులు మారుతున్నాయి. అక్కడక్కడా పెరియార్ విగ్రహాలపై దాడుు జరుగుతున్నాయి. రజనీకాంత్.. ఆస్తికులను రెచ్చగొట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ఆయన ఈ తేనెతుట్టెను కదిలించారని తమిళనాడు రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు కొనసాగితే మాత్రం ఆస్తికులు, నాస్తికుల మధ్య ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి ఉందని.. ఇది రాజకీయ అంశంగా మారుతుందన్న అంచనాలున్నాయి. అదే జరిగితే.. ఓ వర్గానికి రజనీకాంత్ నాయకుడైపోతారు.