జగన్ పెట్టుకున్న పిటీషన్‌ను కొట్టిపారేసిన న్యాయస్థానం

జగన్ పెట్టుకున్న పిటీషన్‌ను కొట్టిపారేసిన న్యాయస్థానం

ఈడీ కేసులో ఏపీ సీఎం జగన్‌కి మరోసారి చుక్కెదురయ్యింది. వ్యక్తిగత హాజర్ మినహాయింపు కోరుతూ జగన్ తరుపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్‌ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్ట్ కొట్టిపారేసింది. అయితే అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన ఐదు ఛార్జీషీట్లలో సీఎం జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నారు.

అయితే ఈ కేసులో మినహాయింపు ఇవ్వడం వలన నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సీఎంగా ఉన్న వ్యక్తికి మినహాయింపు ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపవచ్చని అందుకే జగన్‌కి ఈ కేసులో ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని ఈడీ తరపు న్యాయవాదులు కోర్ట్‌లో తెలిపారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జగన్ పెట్టుకున్న పిటీషన్‌ను కొట్టిపారేసింది, అంతేకాదు తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నేరుగా ఇవ్వకపోయినా తన తరఫున ఇంకొకరు హాజరవుతారని జగన్ పెట్టుకున్న మరో అంశాన్ని కూడా కోర్ట్ తోసిపుచ్చింది. దీనితో ప్రతి శుక్రవారం జగన్ ఖచ్చితంగా న్యాయస్థానంలో హాజర్ కాక తప్పదు.