సమంత మరోసారి శర్వానంద్ తో జత కట్టే అవకాశం

సమంత మరోసారి శర్వానంద్ తో జత కట్టే అవకాశం

ప్రస్తుతం జానూ చిత్రం లో సమంత, శర్వానంద్ కలిసి నటిస్తున్నారు. 96 చిత్రానికి రీమేక్ ఈ చిత్రం. అయితే ఈ చిత్రం తర్వాత సమంత మరోసారి శర్వానంద్ తో జత కట్టే అవకాశం వుంది. RX100 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఈ దర్శకుడు మరే సినిమా చేయలేదు. ఈ చిత్రం కోసం మొదటగా సమంత, నాగ చైతన్య జోడిగా ముందే అనుకున్నారు. కానీ నాగ చైతన్య కోసం చూసి చూసి దర్శకుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలుస్తుంది. శర్వానంద్ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు సమాచారం.

ఈ చిత్రానికి సమంతకి, నాగ చైతన్య కి ఒకే సమయం లో కథ చెప్పారు. అయితే సమంత కి మరొకసారి కథ చెప్పాల్సిన అవసరం కూడా లేదని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 96 చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత శర్వతో మరోసారి నటించేందుకు సమంత ఓకే అనాల్సి వుంది. అజయ్ భూపతి తన మొదటి చిత్రం తర్వాత చేస్తున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతూనే వుంది. మరి ఈ చిత్ర షూటింగ్ ఎపుడు మొదలవుతుందో చూడాలి.