దిల్‌రాజ్‌పై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్

దిల్‌రాజ్‌పై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిల్‌రాజ్‌పై కాస్త సీరియస్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో కనిపించిన పవన్ ఆ తరువాత పూర్తి స్థాయి రాజకీయాలలోకి వెళ్ళిపోయారు. అయితే బాలీవుడ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించిన పింక్ రీమేక్‌తో పవన్ మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతునట్టు సమాచారం వచ్చినా దీని గురుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్ధే హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారట.

అయితే ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వగా, ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో పవన్ తన సినిమా విషయాలను కానీ, షూటింగ్ ప్రకటనలు ఏవీ భయటకు వెల్లడి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే జనవరి 20న రోజు బాగుండటంతో పింక్ రీమేక్ కోసం పవన్ ఓ రోజు వచ్చి షూటింగ్ చేసి వెళ్ళి, అదే రోజు మళ్ళీ సాయంత్రం అమరావతిలోనే కనిపించాడు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పింక్ రీమేక్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చేశాయి. అయితే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో పవన్ షూటింగ్‌కి వెళ్ళడం ఏమిటని కొందరు కామెంట్స్ చేస్తున్నారట. అయితే దీనిపై పవన్ కూడా దిల్ రాజ్‌పై కాస్త సీరియస్ అయ్యారట. ఇప్పటి నుంచి అయినా షూటింగ్‌కి సంబంధించిన వివరాలను కాస్త జాగ్రత్తగా ఉంచాలని కోరారట.