ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై అందరు వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వాట్సాప్ ఈ సదుపాయాన్ని గతేడాది అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామందికి ఆ ఫీచర్ అందుబాటులోకి రాకపోవడంతో పాటు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఏడాది కాలంగా “వాట్సాప్ పే” ఫీచర్‌పై వర్క్ చేస్తుంది.
తాజాగా ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిందని, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది.కాగా, ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ) సహకారంతో ఇండియాలోనే తొలిసారిగా 160 బ్యాంక్‌ల మద్దతుతో వాట్సాప్‌పే ఫీచర్ పనిచేస్తుంది.