టెక్ సంస్థ యాహూ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థ వెల్లడించింది. యాహూ ఇకపై స్టాండెలోన్ సంస్థగా కొనసాగుతుందని పేర్కొంది.
దాదాపు 5 బిలియన్ డాలర్లకు వెరిజోన్ నుంచి యాహూలో మెజారిటీ వాటాలను అపోలోకి చెందిన ఫండ్స్ కొనుగోలు చేశాయి.
యాహూలో వెరిజోన్ 10 శాతం వాటాను అట్టే పెట్టుకుంది. యాహూకి ఇది కొత్త శకమని సంస్థ సీఈవో గురు గౌరప్పన్ వ్యాఖ్యానించారు.