విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ నే సంక్రాంతికి వస్తున్నాం”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా సాలిడ్ టాక్ అందుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్ కి బెస్ట్ ఛాయిస్ గా నిలిచింది.
ఇలా వెంకీ మామ కెరీర్ లో రికార్డు ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకోగా రెండో రోజు కూడా భారీ వసూళ్లు వరల్డ్ వైడ్ గా అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మొదటి రోజు మూవీ 45 కోట్లకి పైగా గ్రాస్ ను కలెక్ట్ చేస్తే రెండో కూడా సాలిడ్ నంబర్స్ అందుకుంది. ఇలా 2 డే కూడా 30 కోట్లకి పైగా గ్రాస్ ను అందుకొని అదరగొట్టింది.
దీనితో ఈ రెండు రోజుల్లో 77 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ మూడో రోజు కూడా భారీ బుకింగ్స్ మూవీ కి కనిపిస్తుండగా ఇదే ఫామ్ వీకెండ్ వరకు ఉండేలా కనిపిస్తుంది. దీనితో వెంకీ మామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఇది నిలిచేలా ఉందని ఇపుడు చెప్పి తీరాలి.