“హనుమాన్” ట్రైలర్ కు మంచి రెస్పాన్స్!

“హనుమాన్” ట్రైలర్ కు మంచి రెస్పాన్స్!
Cinema News

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా నటించిన సూపర్ హీరో సినిమా హనుమాన్. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

“హనుమాన్” ట్రైలర్ కు మంచి  రెస్పాన్స్!
Hanuman Trailer

ఇప్పటి వరకూ 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని రాబట్టగా, 800 కే వరకూ లైక్స్ ని సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ సినిమా లో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.