గూఢచారి ఆశలపై గోవిందం నీళ్లు…!

Goodachari Gets Shock From Geetha Govindam

అడవి శేషు, శోభిత జంటగా తెరకెక్కిన ‘గూఢచారి’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పెట్టిన పెట్టుబడికి దాదాపు మూడు రెట్లు లాభం వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కలెక్షన్స్‌ క్లోజ్‌ అయ్యాయి. కాని ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రం ఇంకా ఒక మోస్తరు కలెక్షన్స్‌ను రాబడుతూనే ఉంది. మెల్ల మెల్లగా ఏడు లక్షల డాలర్లను వసూళ్లు చేసింది. ఖచ్చితంగా మరో మూడు లక్షల డాలర్లను వసూళ్లు చేసి మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేయడం ఖాయం అనుకున్నారు. ఈ వారాంతంలో గూఢచారి చిత్ర కలెక్షన్స్‌ మిలియన్‌ డాలర్లను చేరే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఈ చిత్రం ఆశలపై గీత గోవిందం చిత్రం నీళ్లు జల్లింది.

geet-ha

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా కనీవిని ఎరుగని రీతిలో వసూళ్లు సాధిస్తుంది. రెండు మిలియన్‌ డాలర్లను అక్కడ వసూళ్లు చేయడం ఖాయం అంటూ ఇప్పటికే తేలిపోయింది. ఈ వారాంతంలో మొత్తం కూడా గీత గోవిందంపై పడుతున్నారు. దాంతో గూఢచారి చిత్రంకు వసూళ్లు డ్రాప్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లక్ష డాలర్ల వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో గూఢచారి చిత్రం మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరడం అసాధ్యం అంటూ తేలిపోయింది. అడవి శేషు చాలా ఆశలు పెట్టుకున్న ఓవర్సీస్‌ మార్కెట్‌లో గీత గోవిందం పెద్ద దెబ్బేయడం జరిగింది. మొదటి వారాంతంలోనే ఈ చిత్రం మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. పాజిటివ్‌ రివ్యూలు రావడంతో పాటు సినిమాలో విజయ్‌ దేవరకొండ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. దాంతో ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం.

goodachari