ఆగని కేరళ విలయం…భారీగా మృతులు !

Death toll due to floods has risen to 167 says Kerala CM Pinarayi Vijayan

ఆగస్టు 8 నుంచి ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వలన కేరళ రాష్ట్రం అల్లాడుతోంది. రుతుపవనాలు, అల్పపీడనాల వల్ల ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాల వలన రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి. ఎక్కడికక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం.. వరద నీరు ఊర్లను ముంచెత్తడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులై పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

Kerala CM Pinarayi Vijayan

మొత్తానికి వరదల తాకిడికి చనిపోయిన వారి సంఖ్య 167కు చేరింది.ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రకటించార. ఈరోజు కూడా భారత వాతారణ శాఖ మరోసారి కేరళకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో (కాసర్గోడ్ తప్ప) అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

Kerala rains