గూగుల్ పిక్సెల్ వాచ్‌‌‌‌

గూగుల్ పిక్సెల్ వాచ్‌‌‌‌

టెక్ దిగ్గజం గూగుల్ నుంచి స్మార్ట్‌వాచ్‌‌‌‌‌ రాబోతోందని ఎప్పటి నుంచో అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో 2022లో ఎట్టకేలకు గూగుల్ స్మార్ట్‌వాచ్‌‌‌‌‌ తీసుకురావడం దాదాపు కచ్చితమనే సమాచారం బయటకి వచ్చింది.

పిక్సెల్ వాచ్‌‌‌‌ పేరిట విడుదల చేయాలనుకుంటున్న స్మార్ట్‌వాచ్‌‌‌‌‌ టెస్టింగ్ ను గూగుల్ ఇప్పటికే ప్రారంభించిందట. పరీక్షలు మొత్తం ముగిశాక వచ్చే ఏడాది విడుదల చేయాలని గూగుల్ నిర్ణయించుకుందని ఆ సంస్థ అంతర్గత వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది. ఫిట్ బిట్ నుంచి ప్రత్యేక గూగుల్ హార్డ్ వేర్ బృందం ఈ వాచ్‌‌‌‌ను రూపొందిస్తోంది.

వేర్ ఓఎస్‌‌ పేరుతో స్మార్ట్‌వాచ్‌‌‌‌‌ల కోసం 2014లోనే ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేసిన గూగుల్ సొంత బ్రాండ్ తో ఇంత వరకు స్మార్ట్‌వాచ్‌‌‌‌‌ మాత్రం తీసుకురాలేదు. ఫాసిల్, గ్రామిన్, సామ్‌సంగ్‌ సంస్థల కొన్ని ప్రీమియమ్ స్మార్ట్‌వాచ్‌‌‌‌‌లు ఈ వేర్ ఓఎస్‌‌తోనే నడుస్తున్నాయి.

పిక్సెల్ వాచ్‌‌‌‌ పేరుతో గూగుల్ స్మార్ట్‌వాచ్‌‌‌‌‌ విడుదల చేయనుంది. ఈ వాచ్ తయారీ ప్రాజెక్టుకు రోహన్ అని పేరు పెట్టింది టెక్ దిగ్గజం. అయితే సామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌‌‌‌ సిరీస్‌లా విభిన్న సైజుల్లో గూగుల్ వాచ్‌‌‌‌‌లు తీసుకొస్తుందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

గూగుల్ పిక్సెల్ వాచ్‌‌‌‌.. వేర్ ఓఎస్‌‌ 3 ఆపరేటింగ్ సిస్టంపై నడవనుంది. అలాగే బెజిల్స్ లేకుండా రౌండ్ డయల్ డిజైన్ తో స్టైలిష్ లుక్ తో పిక్సెల్ వాచ్‌‌‌‌ రానుంది. హెల్త్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని ఫీచర్లు ఈ వాచ్‌‌‌‌లో ఉండనున్నాయి. అలాగే ఫిట్ బిట్ స్మార్ట్‌వాచ్‌‌‌‌‌ కంటే ఎక్కువ ధర ఉండే పిక్సెల్ వాచ్‌‌‌‌.. యాపిల్ వాచ్‌‌‌‌కు గట్టిపోటీగా వచ్చే అవకాశం ఉంది.

అలాగే స్టెప్ కౌంటర్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్ లాంటి బేసిక్ ఫిట్‌నెస్‌ ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. అలాగే ఈ వాచ్‌‌‌‌లో ఫిట్ బిట్ కు సంబంధించిన కొన్ని అంశాలను కూడా పొందుపరచాలని గూగుల్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు గూగుల్ పిక్సెల్ వాచ్‌‌‌‌ నిరంతరాయంగా వాడితే ఒక్కరోజు చార్జింగ్ మాత్రమే వస్తుందని టెస్టింగ్ ద్వారా బయటపడిందట.

అంటే గూగుల్ వాచ్‌‌‌‌ను ప్రతీరోజూ చార్జ్ చేయాల్సిందే. గూగుల్ పిక్సెల్ వాచ్‌‌‌‌ ను ఇప్పటికే ఆ సంస్థ ఉద్యోగులు టెస్ట్ చేస్తున్నారు. నిత్యం ఈ వాచ్‌‌‌‌ కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను నమోదు చేస్తున్నారు.వేర్ ఓఎస్‌‌కు ఈ సంవత్సరం మొదట్లోనే పెద్ద అప్‌డేట్‌ తెచ్చింది గూగుల్. వేర్ ఓఎస్‌‌ 3ని విడుదల చేసింది. ఈ ఓఎస్‌‌తో సామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌‌‌‌ 4 మొదటగా విడుదలైంది. ఇప్పటికీ ఈ కొత్త ఓఎస్‌‌తో నడుస్తున్న స్మార్ట్‌వాచ్‌‌‌‌‌ అదే.