సన్నీ డియోల్ చిత్రానికి గోపీచంద్ యాక్షన్ అప్‌డేట్…!

Gopichand action update for Sunny Deol movie...!
Gopichand action update for Sunny Deol movie...!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ గత ఏడాది “గదర్ 2” బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ మూవీ తర్వాత తాను మన టాలీవుడ్ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ను ఇపుడు చేస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ కాంబో అని అంటూ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుంది. అయితే ఈ మూవీ పై మేకర్స్ కానీ దర్శకుడు కానీ ఎప్పుడుకప్పుడు అప్డేట్స్ అందిస్తుండగా ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ పై మరో అప్డేట్ ను దర్శకుడు అందించాడు.

Gopichand action update for Sunny Deol movie...!
Gopichand action update for Sunny Deol movie…!

అయితే ఈసారి ఒక యాక్షన్ అప్డేట్ ను అయితే తాను అందించారు అని చెప్పాలి. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ తో ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ ను తాను డిజైన్ చేస్తున్నట్టుగా మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ తాజా అప్డేట్ కూడా అందించారు. ఇలా మొత్తంగా అయితే మూవీ ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుంది. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ ని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీ హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.