Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Gorantla Comparing Chandrababu and Jagan
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. తమ అధ్యక్షుణ్ని పొగుడుతూ, ఎదుటి పక్షం అధినేతను దొరికినప్పుడల్లా విమర్శించటం అన్ని పార్టీల నేతలూ చేసే పనే. ఈ ఆరోపణలు, విమర్శల పర్వం ఎప్పుడూ సాగుతుండేదే అయినా…కొన్ని విమర్శలు అప్పుడప్పుడు పరిధిని దాటిపోతుంటాయి. మరికొన్ని ఏ మాత్రం నమ్మశక్యంగానివిగా ఉంటాయి. ఇంకొన్ని విమర్శలు అవును నిజమే సుమా అన్నట్టు అనిపిస్తాయి.
నంద్యాల ఉప ఎన్నిక ప్రచార భేరీ లో ముఖ్యమంత్రిని ప్రతిపక్షనేత జగన్ కాల్చండి, ఉరితీయండి అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారమే సృష్టించాయి. జగన్ పరిధిని దాటి వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలే కాదు..వైసీపీలోని కొన్ని వర్గాలు కూడా ఆఫ్ ద రికార్డ్ అంగీకరించాయి. ఇక కాంగ్రెస్ అయితే బహిరంగంగానే జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. జగన్ తీరుపై చంద్రబాబు మాత్రం హుందాగానే స్పందించారు.
నంద్యాల ప్రచారంలో ఆయన టీడీపీకి ఓట్లేయాలని కోరుతూ…ప్రతిపక్షాన్ని కాల్చొద్దు..ఉరితీయొద్దు..ఓటుతోనే ఖతం చేయండి అని ఓటర్లకు పిలుపునివ్వటం ద్వారా జగన్ కు హుందా అయిన రీతిలో బదులు చెప్పారు. చంద్రబాబే కాదు…ఆయన పార్టీలోని ఇతర నేతలు కూడా జగన్ వైఖరిపై సునిశితంగానే విమర్శలు చేస్తుంటారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబును, జగన్ ను పోల్చిచూపుతూ చేసిన ఓ విమర్శ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మారిస్తే..ప్రతిపక్ష నేత జగన్ శుక్రవారాన్ని జైలు వారంగా మార్చుకున్నారని ఈ ఇద్దరి మధ్య తేడాను నంద్యాల, కాకినాడ ఓటర్లు గమనించాలని ఆయన కోరారు.