ఈ ఏడాది గణేష్ నిమజ్జనం సమయంలో ప్రభోధానంద అనే స్వామిజీ ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తుల మధ్య జరిగిన గొడవ గుర్తుంది కదా. ఆ విషయంలో పోలీసుల పై జేసీ దివాకర్ రెడ్డి చేసిన విమర్శలకు నంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం పేరుతో గోరంట్ల మాధవ్ అనే సీఐ జేసీని నాలుక కోస్తా అంటూ రాజకీయ నేతగానే మాట్లాడిన తీరు చూసి చాలా మంది ఏంటబ్బా అనుకున్నారు. అయితే అసలు విషయం ఇప్పుడు బయటపడుతోంది. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారు. ప్రస్తుతం కదిరి అర్బన్ సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి గారికి అందజేశారు.
డిఎస్పీ ఆలేఖ ను జిల్లా ఎస్పీ ఙీవీజీ అశోక్ కుమార్ కు పంపారు. రాజీనామా ఆమోదించండం లాంఛనమే కావొచ్చు.ఇప్పటికే ఆయన వైఎస్ జగన్ తోనూ సమావేశమై తన భవిష్యత్ విషయంలో క్లారిటీ తీసుకున్నారట. అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్‌సభ టిక్కెట్ ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారని సమాచారం. మాట మెదిలితే మావాడు మావాడు అంటూనే జగన్ ను తీవ్ర విమర్శలు చేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి పై సీఐ మాధవ్ విరుచుకుపడిన విదానం జగన్‌కు బాగా నచ్చిందని, అందుకే ఆయనను పార్టీలోకి తెచ్చి టికెట్ ఇవ్వల్నుకున్తున్నారట. హిందూపురం పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీ నిమ్మ్మల కిష్టప్ప ఉండగా వైసీపీకి నదీమ్ అనే నేత ఇన్చార్జ్ గా ఉన్నారు. ఆయన బలమైన నేత కాకపోవడంతోనే గోరంట్ల మాధవ్‌ను రంగంలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.