మరోసారి నోరుజారిన గౌతమ్ గంభీర్

మరోసారి నోరుజారిన గౌతమ్ గంభీర్

ఏ సిరీస్ ఆడాలో ధోనీ స్వయంగా నిర్ణయం తీస్కోవడమేంటి అని గౌతంగంభీర్ ఇటీవల విమర్శలు చేశారు. వరల్డ్‌కప్‌ తర్వాత ఈ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ తీసకోబోతున్నారని కథనాలు చాలా వినపడ్డాయి. కానీ ధోనీ వెస్టిండీస్,దక్షిణాఫ్రికాతో సిరీస్‌కి,బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి కూడా అందుబాటులో ఉండనని సెలక్టర్లకి తెలిపాడు.

ధోనీపై మరోసారి గౌతమ్ గంభీర్ నోరుజారుతూ 2023 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ ఆడటం అసాధ్యం, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగడం అనుమానమేనని చెప్తున్నాడు.

ప్రపంచకప్‌ ప్రణాళికల్లో నువ్వు లేవు అని ధోనీకి చెప్పేస్తే యువ వికెట్ కీపర్లకి అవకాశం వస్తుంది. ధోనీని పక్కనపెట్టి భారత్ జట్టు ఇక ముందుకు వెళ్లాలని గంభీర్ జోస్యం చేసుకుని చెప్పారు.