పేదోడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రూ.22వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందని అన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.