Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాదేదీ కవితకనర్హం ఇది ఒకప్పటి సామెత కాదేదీ పబ్లిసిటీకి అనర్హం ఇది నేటి మాట. అదేంటి అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందునా ఆ సినిమా ఆడియో అయితే ప్రజల్లోకి ఎంత బాగా వెళ్లిందో వారు ఆ పాటలను రోజూ వారీ పనుల్లో పాడుతుంటేనే అర్ధం అవుతోంది. అంతగా ప్రజల్లోకి వెళ్ళిన పాటని మనమెందుకు వాడుకోకోడదు అనుకున్నారు ప్రభుత్వ పాటశాల ఉపాధ్యాయులు అనుకున్నదే తడవుగా ఫ్లెక్సీలు కూడా కొట్టించేసారు.
“ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తవా” అన్న రంగస్థలం పాట మామూలు హిట్ కాలేదు. అయితే దీనిని తెలివిగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రచారం కోసం వాడుకోవడం చూసి జనాలు ఔరా అనుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలు నమ్మకం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఈ ప్రచారానికి తెరలేపిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల క్రియేటివిటీ చూసి ప్రజలు అభినందిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కాజలూరు శ్రీరామ్ నగర్ కాలనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ గట్టునుంటావా విద్యార్థి .. ఈ గట్టు కొస్తావా ? అన్న లైన్ తో మొదలు పెట్టి ఆ గట్టున ఇరవై వేల ఖర్చు .. ఈ గట్టున నాణ్యమయిన చదువు అంటూ ప్రైవేటు పాఠశాలలు వసూలు చేసే ఫీజుల నుండి డ్రస్సులు, పుస్తకాలు, రవాణా ఖర్చులు, ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఉచిత చదువును పోలుస్తూ పోస్టర్ రూపొందించారు.