మందు బాబులకు శుభవార్త

మందు బాబులకు శుభవార్త

ఏపీలో మందబాబులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది.. మద్యం ధరల్ని తగ్గించింది. మీడియం, ప్రీమియంలో 25శాతం వరకు ధరలు తగ్గాయి. రూ.250-300 వరకు ఉన్న మద్యం ధరపై రూ.50 తగ్గించిన ప్రభుత్వం. ఐఎంఎఫ్‌ఎల్ లిక్కర్‌తో పాటూ విదేశీ మద్యం ధరలు కూడా తగ్గించారు. రూ.50 నుంచి రూ.1350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్య ధరలు తగ్గాయి. రేపటి నుంచి తగ్గించిన మధ్యం ధరలు అమల్లోకి రానున్నాయి.. బీరు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో .. రూ.200 క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పులు లేవు. సెప్టెంబర్‌లో కూడా ప్రభుత్వం మద్యం ధరల్ని తగ్గించింది.

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా నిఘా పెట్టారు. దీని కోం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది శానిటైజర్ తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్‌‌ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారట. ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.