షాక్ లో ఏపీ సచివాలయం.. ఉద్యోగిని ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయం వ్యవస్థను రూపొందించిన విషయం తెలిసిందే. అలాంటి సచివాలయంలో ఓ గ్రామ సచివాలయ ఉద్యోగిని  ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగుతోంది. చిత్తూరు జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య పలు అనుమానాలకు దారితీస్తుంది. స్వాతి అనే యువతి యాదమరి మండలం కమ్మపల్లె గ్రామ సచివాలయంలో పశుసంవర్ధక శాఖ అసి‌స్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే మండలం మాదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో అద్దె గదిలో నివాసం ఉంటున్నారు.

అయితే అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ… ఆ అద్దె ఇంట్లోనే స్వాతి ఫ్యాన్‌కి ఉరివేసు కున్నట్లు గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు స్థానికులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఆ ఉద్యోగిని స్వాతి స్వస్థలం చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఐకే రెడ్డిపల్లి. అంతేకాకుండా  ఆమెకు పెళ్లై రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆమె ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను.. కుటుంబ సభ్యుల కోణాన్ని అన్నింటినీ పోలీసులు విచారిస్తున్నారు.