తెలంగాణలో మరో ఆరుగురిని బలికొన్న కరోనా

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తుంది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం సరిహద్దులన్నింటినీ మూసివేసింది. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జనాలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడిన ఆరుగురు మృతి చెందడం అంతటా కలకలం రేపుతుంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో ఈ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారు. వీరిలో ఆరుగురు మృతి చెందారు. ఇక మృతి చెందిన వారిలో.. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో.. ఒకరు అపోలో ఆసుపత్రిలో.. ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో.. ఒకరు నిజామాబాద్ లో.. ఒకరు గద్వాలలో మృత్యువాత పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను గుర్తించి.. ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

అంతేకాకుండా వారికి పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు. ఈ నెల 13 నుంచి 15వరకు ఢిల్లీలో జరిగిన ప్రార్థనల్లో సుమారు 2 వేలమంది పాల్గొన్నారు. 75 దేశాలకు చెందినవారు ఈ కార్యక్రమాన్ని హాజయ్యారు. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో వెళ్లడం ఇప్పుడు అధికారులను కలవరానికి గురిచేస్తుంది. హైదరాబాద్ నుంచి 186, ఆదిలాబాద్10, నిజామాబాద్18, మెదక్ 26, రంగారెడ్డి 15, మహబూబ్ నగర్ 25, నల్గొండ 21, ఖమ్మం 15, వరంగల్ 25, కరీంనగర్ 17, భైంసా 11, నిర్మల్ 11మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.