మూడేళ్ల మనరాలిని చంపేసిన బామ్మ

మూడేళ్ల మనరాలిని చంపేసిన బామ్మ

రాజస్థాన్‌లోని కనకాబాయి (50) అనే ఓ మహిళ ఓ గొడవ విషయంలో మరో వ్యక్తికి గుణపాఠం నేర్పడానికి తన మూడేళ్ల మనరాలిని చంపేసింది. పైగా ఆ బాలికను రామేశ్వర్ మొగ్యా అనే వ్యక్తి చంపినట్లు ఆరోపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మే 30 న, బోరినా గ్రామంలోని రెండు గ్రూపులు నీళ్ల కోసం వెళ్లి మార్గం మధ్యలో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో కొంతమంది గాయపడగా.. అమర్‌లాల్ మొగ్యా అనే ‍‍వ్యక్తి మూడేళ్ల కుమార్తె మృతి చెందింది.

దాంతో రామేశ్వర్ మొగ్యాపై ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రామేశ్వర్ మొగ్యా కుమార్తె కూడా గొడవలో గాయపడినట్లు గుర్తించారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కనకబాయి.. రామేశ్వర్ మొగ్యాను బెదిరించింది. దాంతో రామేశ్వర్ మొగ్యా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కనకబాయి ప్రవర్తనపై అనుమానం రావడంతో విచారించి నిందితురాలిని అరెస్ట్‌ చేశారు.