నారాయణ రెడ్డి “గ్రాండ్‌పా కిచెన్’” పేరుతో 2017 ఆగస్టులో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. అక్టోబర్ 27న వంటల తాత చనిపోయినట్లు చెందినట్లు ఆయన అనుచరులు ఛానెల్లో తెలిపారు.
యూట్యూబ్‌లో గ్రాండ్ పా కిచెన్ అని ఒక ఛానెల్‌ను ప్రారంభించి కొద్దికాలంలోనే 6.11 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను పొందారు. ఒకేసారి పెద్ద మొత్తంలో వంటకాలు చేసి అనాథ పిల్లలకు ఆహారం పంపిణీ చేస్తుండేవారు. వాటికి సంబందించిన వీడియోస్ ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి తనకి వచ్చిన ఇంగ్లీషులో ఆయన వంటకాల తయారీని వివరిస్తూ ఉండేవారు. వంతల తాత నారాయణ రెడ్డి ప్రాంతీయ వంటకాలే కాకుండా విదేశీ వంటకాలు కూడా చేసి చూపించేవారు.
తన యూట్యూబ్ ఛానెల్‌ద్వారా వచ్చిన డబ్బును నారాయణ రెడ్డి పేద పిల్లల, అనాథ పిల్లలకి ఇచ్చేవారు. ఈ ఛానెల్‌ను ప్రారంభించడానికి ముఖ్య కారణం కూడా పేద పిల్లల, అనాథ పిల్లల కోసమే అని వంటల తాత చాలా సందర్భాల్లో తెలిపారు