తాతగారి పాట ను రీమేక్ చేసిన మనవడు

సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన గల్లా అశోక్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ ‘దేవదాస్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ ‘నిధి అగర్వాల్ ‘ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు సీనియర్ నరేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
గల్లా అశోక్ తన తాతగారి పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసాడు. ఈ సందర్భంగా గల్లా అశోక్.. ”తాతగారు నా ఎవర్ గ్రీన్ లెజెండ్. నాతో పాటు వేలాదిమందికి ఆయన ఆదర్శం అని చెప్పారు .అంతే కాదు అయన మనవడు గా పుట్టటం నా అదృష్టం అని కూడా చెప్పారు .
ఇంక సినిమా విషయానికి వస్తే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘జుంబారే జుమ్ జుంబారే’ అనే పాటను అశోక్ గల్లా తన సినిమా కోసం రీమేక్ చేసాడు. ఈ పాటలో సూపర్ స్టార్ కృష్ణ తన డ్యాన్సుతో ఎలా అలరించాడో అశోక్ గల్లా కూడా కృష్ణ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అదిరిపోయేలా స్టెప్పులు వేశాడు. ముఖ్యంగా కృష్ణ సిగ్నేచర్ స్టెప్ మరియు ఆయన హావభావాలు అశోక్ ఈ సాంగ్ ప్రోమోలో చూపించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. షూటింగులకు అనుమతి లభించిన వెంటనే రిమైనింగ్ భాగం కంప్లీట్ చేయనున్నారు.