కరోనా మహమ్మారి వీరలెవల్లో విజృంభిస్తుంది. ఆ దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కార మార్గంగా భావించిన ప్రభుత్వాలు దీనిని కొనసాగిస్తున్నాయి. దీంతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం, కొన్ని స్వచ్చంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. అయినా కానీ పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా తమకి తోచినంత సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్, ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ వ్యస్థాపకుడు రోహిత్‌తో కలసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు. సుమారు 5000 మంది కూలీలకు ఇంటి అద్దెతో పాటు నిత్యావసరాలు, పిల్లలకు భోజనం సౌకర్యాలు మొత్తం ఎంత అవుతుందో లెక్క వేసి అంత మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వివేక్ వెల్లడించారు. అలాగే… సౌత్ అనే కార్యక్రమం ద్వారా ఈ సాయం చేస్తున్నట్టు వివేక్ స్పష్టం చేశారు.