ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోకొద్దీ రోజుల్లోనే మరొక ఎన్నికల నగారా మోగనుంది. అందుకని హైకోర్టు కూడా సమ్మతం తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ నెల 17న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. అయితే ఈ ఎన్నికలను రానున్న మార్చి 15 లోపు పూర్తీ చేయాలనీ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇకపోతే దీనితో పాటే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరికొన్ని ప్రత్యేకమైన ఆదేశాలను కూడా జారీ చేసింది.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే,రాష్ట్రంలోని అన్ని పంచాయతీ కార్యాలయాలకు తమ వైసీపీ పార్టీకి సంబందించిన రంగులను వేశారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడాన్ని సవాలు చేస్తూ, కొన్ని సంఘాల వారు పిటిషన్ వేశారు. కాగా ఈమేరకు న్యాయస్థానంలో తాజాగా విచారణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలపై అధికార పార్టీ రంగులను తొలగించాలని హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆ కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబందించినవని, వాటిపై ఏ ఇతర పార్టీకి సంబందించిన రంగులు ఉండకూడదని పలు హెచ్చరికలు జారీ చేసింది.