Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయ టీవీ. తమిళనాడులో చాలా ఫేమస్. జయ టీవీలో వార్త వచ్చిందంటే.. అది అమ్మ మనసులో ఉన్నట్లేనని తంబీలు బలంగా నమ్ముతారు. అందుకే జయ అధికారంలో ఉన్నా.. లేకపోయినా జయ టీవీకి మాత్రం ఆదరణ తగ్గదు. ఈ మధ్య కాలంలో అన్ని ఛానెళ్ల కంటే జయ టీవీకే రేటింగ్స్ పెరిగాయని కూడా తెలుస్తోంది. అలాంటి జయ టీవీ కోసం ఏఐడీఎంకే గ్రూపులు తన్నులాట మొదలెట్టాయి.
విజయవంతంగా దినకరన్, శశికళను పార్టీ నుంచి గెంటేసిన పళని, పన్నీర్.. ఇప్పుడు టీవీ, పేపర్ మీద పడ్డారు. పార్టీ టీవీ జయ టీవీ, పార్టీ పేపర్ నమదు ఎంజీఆర్ ను పార్టీకి స్వాధీనం చేయాలి తీర్మానం చేసిపడేశారు. కానీ దినకరన్ బ్యాచ్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. వ్యక్తిగత ఆస్తుల్ని పార్టీకి ఎందుకివ్వాలని అడ్డం తిరుగుతోంది. జయ టీవీ ఎండీ జయరామన్ కూడా తీర్మానాన్ని ఖండించారు.
మరోవైపు జయ టీవీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అమ్మ చల్లటి నీడలో చీకూ చింతా లేకుండా జీవితాలు వెళ్లిపోతున్నాయని, ఇప్పుడు అనవసర తగాదాలతో తమ పుట్టి ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయ టీవీ శశికళ వ్యక్తిగ ఆస్తే అయినా.. అది మోసం చేసి రాయించుకున్నదని అంటున్నారు. ఓ రకంగా పన్నీర్, పళని దగ్గరకు వెళితేనే బెటరనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: