జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కడప నత్తంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మైనర్ బాలిక కోసం ఓ యువకుడి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వివరాల్లో వెళ్తే.. కడప నత్తం గ్రామంలో చాంద్ భాషా అనే యువకుడు తనతో ఫోన్ మాట్లాడాలంటూ.. ఓ మైనర్ బాలికను తరచూ వేధిస్తున్నాడు. అతనితో ఫోన్ మాట్లాడటానికి ఆ బాలిక నిరాకరించి, వేధింపుల గురించి తన తల్లిదండ్రులకు తెలిపింది.
దీంతో కోపం పెంచుకున్న ఆ యువకుడు అర్ధరాత్రి సమయంలో బాలిక నివాసం వద్దకు వచ్చి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. బాలిక తల్లిదండ్రులు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.