ఆగ‌స్ట్‌లో రాబోతున్న ‘గుణ 369’

guna 369 releases in august

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కార్తికేయ ఆ మ‌ధ్య హిప్పీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. ప్ర‌స్తుతం అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో గుణ 369 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంకి సంబంధించి ఇటీవ‌ల టీజర్ విడుద‌ల కాగా ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 2న గుణ 369 చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న అన‌గ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.