ఫారెస్ట్ ఆఫీసర్ ముందే చిరుతను చంపేశారు..

leopard killed in front of forest officers

అటవీ శాఖ అధికారి ముందే చిరుతను చంపేశారు. ఈ సంఘటన కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని కురుబరహళ్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుబరహళ్లి గ్రామంలోకి రెండు రోజుల క్రితం చిరుత పులి ప్రవేశించింది. దానిమ్మ తోటలో ఉన్న ఇద్దరు వ్యక్తులపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో చిరుతపై కోపం పెంచుకున్న గ్రామస్థులు.. దాన్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే బుధవారం ఓ చెట్టుపై చిరుత ఉండడాన్ని గమనించిన గ్రామస్థులు.. దాన్ని చుట్టుముట్టారు. చిరుతపైకి రాళ్లు విసిరారు. ఈ క్రమంలో చిరుత కిందకు దూకింది. దీంతో ఒక్కసారిగా చిరుతపై కర్రలతో సామూహికంగా దాడి చేశారు. తీవ్రంగా గాయాలపాలైన చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా అటవీశాఖ అధికారి కళ్లెదుటే జరిగింది.