గుణశేఖర్ నోటితో హిరణ్యకశ్యప కి చేటు.

Gunasekhar to do Hiranya Kashyapa movie with Rana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రుద్రమదేవి సినిమా కి అవార్డు రాలేదని రచ్చ చేసిన గుణశేఖర్ భవిష్యత్ మీద నంది ప్రభావం గట్టిగా పడేలా వుంది. రుద్రమదేవి సినిమా ని ఇటు నిర్మాతగా అటు దర్శకుడుగా తలకెత్తుకున్న గుణశేఖర్ కి సాయం చేసినా చేయకపోయినా ఆయన మీద ఇండస్ట్రీ జనాలు సానుభూతి చూపారు. ఆ సినిమా ఆడాలని కోరుకున్నారు. మొత్తానికి అంతా అనుకున్నట్టే గుణశేఖర్ ఆంత భారీ ప్రాజెక్ట్ చేపట్టి కూడా సేఫ్ గా బయటపడ్డాడు. అప్పట్లో ఓ టాక్ బలంగా వినిపించింది. గుణశేఖర్ కాకుండా ఈ సినిమాని ఇంకో భారీ నిర్మాత చేసి ఉంటే మార్కెట్ స్థాయి ఇంకా పెరిగేదని, దర్శకత్వం కూడా ఇంకా బాగా చేసే అవకాశం ఉండదని ఇండస్ట్రీ లో అనుకున్నారు. అప్పుడే దిల్ రాజు లాంటి వాళ్ళు మంచి స్క్రిప్ట్ తో వస్తే గుణ తో భారీ సినిమా చేయడానికి రెడీ అన్నారు. అలాగే ఇంకొందరు నిర్మాతలు కూడా గుణ మీద ఇంటరెస్ట్ చూపారు.

Gunasekhar-and-suresh-babu

రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ హిరణ్య కశ్యప స్క్రిప్ట్ చేసుకున్నారు. ఈ సినిమాకి మొదట ఎన్టీఆర్ పేరు వినిపించినా రానా దగ్గర సెటిల్ అయ్యింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉండేందుకు రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంతలో నందుల వివాదం ముందుకు వచ్చింది. ముందుగా వివాదం రేపిన బన్నీ వాసు కి వాళ్ళ వెనుక అల్లు అరవింద్ లాంటి మెగా ప్రొడ్యూసర్ అండ వుంది. కానీ గుణశేఖర్ ఏ క్యాంపు మనిషి కాదు. ఇక తాజా వివాదంతో ఆయన ఓ క్యాంపు కి టార్గెట్ అయ్యే అవకాశం వుంది. దీంతో గుణకి కొత్త సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు. కథ మొదలుకుని ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా వుండే సురేష్ బాబు కొందరు టార్గెట్ చేసే అవకాశం వున్న గుణతో హిరణ్య కశ్యప లాంటి భారీ ప్రాజెక్ట్ కి ఇంతకుముందులాగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆంత తేలిగ్గాదు. ఒకవేళ సురేష్ బాబు వెనక్కి తగ్గితే ఈ ప్రాజెక్ట్ మీద పెట్టుబడి పెట్టడానికి ఇంకో పెద్ద ప్రొడ్యూసర్ కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత తేలిక కాదు. మొత్తానికి గుణశేఖర్ నోటితో హిరణ్య కశ్యప కి చేటు వచ్చింది.