అజ్ఞాతవాసిని అమరావతిలో ప్లాన్‌ చేస్తున్నారట!

pawan-Agnathavasi-Audio-Lau

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

పవన్‌ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం పవన్‌ కెరీర్‌లో 25వ చిత్రం అవ్వడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వారణాసిలో జరుగుతుంది. ఈనెల చివర్లో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవుతుందని, త్వరలోనే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని నిర్మాత రాధాకృష్ణ ఇటీవలే పేర్కొన్నారు. డిసెంబర్‌ మూడవ వారంలో సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చేసే అవకాశం ఉంది.

agnathavasi-movie-audio-ven

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘అజ్ఞాతవాసి’ ఆడియోను పవన్‌ అమరావతిలో విడుదల చేయాలని ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసమయంలోనే జనసేన పార్టీ నిర్మాణం కూడా చేస్తున్నాడు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో తన కార్యక్రమాలు ఎక్కువ పెట్టేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అందులో భాగంగానే అమరావతిలో అజ్ఞాతవాసి ఆడియోను విడుదల చేయాలని పవన్‌ కోరుకుంటున్నాడు. అందుకోసం నిర్మాత రాధాకృష్ణ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదో రాజకీయ వేదికగా కూడా పవన్‌ వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ వేదికపై పవన్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

pawan-kalyan-agnathavasi-mo

కీర్తి సురేష్‌, అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అందుకే సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతుంది. 200 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.