గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్….ఎంతో తెలుసా…..!

గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్….ఎంతో తెలుసా.....!
Cinema News

మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. గుంటూరు కారం మూవీ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల మరియు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు. అయితే సంక్రాంతి కానుకగా శుక్రవారం రోజున ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తొలిరోజు కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు సమాచారం అందుతోంది.

గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్….ఎంతో తెలుసా.....!
Guntur Karam

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 31 కోట్లు గుంటూరు కారం మూవీ రాబట్టినట్టు సమాచారం. ఇక పండుగ రోజుల్లో కలెక్షన్లు నిలకడగా ఉండే… అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాగా గుంటూరు కారం మూవీ బాగాలేదని… అజ్ఞాతవాసి కంటే దారుణంగా ఉందని కొంతమంది కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ కలెక్షన్ల పరంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లకు పైగా వసూలు చేసింది గుంటూరు కారం మూవీ . మరో మూడు రోజులు ఇలాగే కలెక్షన్స్ చేస్తే మూవీ సక్సెస్ అయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.