“సైంధవ్” – ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

“సైంధవ్” – ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
Cinema News

విడుదల తేదీ : జనవరి 13, 2024

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా తదితరులు

దర్శకుడు : శైలేష్ కొలను

నిర్మాత: వెంకట్ బోయనపల్లి

సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన్

ఎడిటింగ్: గ్యారీ BH

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్”. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేష్) తన కూతురు గాయత్రి (సారా)తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. వారి ఇంటి పక్కన ఉండే మనోజ్ఞ (శ్రద్ధ శ్రీనాథ్) పాపని చూసుకుంటుంది. అయితే, గతంలో సైంధ‌వ్ కోనేరు చేసిన క్రైమ్ కారణంగా, కార్టెల్ లో అతని పేరు వింటేనే భయపడిపోతారు. అలాంటి గతం ఉన్న సైంధ‌వ్ కోనేరు అన్ని వదిలేసి కూతురి కోసం బతుకుతుంటాడు. కానీ, గాయత్రికి స్పైనల్ మాస్క్యూలర్ ఎంట్రోపీ అనే వ్యాధి వస్తుంది . ఆ వ్యాధి నుంచి పాప బయట పడాలంటే రూ .17 కోట్ల విలువ కలిగిన వైల్ కావాలి. ఆ డబ్బుకోసం సైంధ‌వ్ ఏం చేశాడు ? తన పాపని రక్షించుకున్నాడా ?, లేదా ?, ఈ క్రమంలో వికాస్ మాలిక్‌ (నవాజుద్దీన్) తో వచ్చిన గొడవ ఏమిటి ?, చివరకు సైంధ‌వ్ కోనేరు తన కూతురు కోసం ఏం సాధించాడు ?, ఈ మధ్యలో డా. రేణు (రుహాని శర్మ ), జాస్మిన్‌ (ఆండ్రియా జెరెమియా) పాత్రలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సైంధవ్ కోనేరు అనే సైకో పాత్రలో వెంకటేష్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ వెంకటేష్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. వెంకటేష్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో వెంకటేష్ చాలా బాగా నటించాడు. అతిధి పాత్రలో నటించిన ఆర్య కూడా మెప్పించాడు.

“సైంధవ్” –  ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
Saindhav Movie

మరో కీలక పాత్రలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించింది. జాస్మిన్‌ పాత్రలో ఆండ్రియా జెరెమియా ఒదిగిపోయింది. డా. రేణుగా రుహాని శర్మ నటన కూడా బాగుంది. జిషు సేన్‌గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు. దర్శకుడు శైలేష్ కొలను రాసుకున్న యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మూవీ లో ప్రధాన కథాంశం, సైంధవ్ పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మాత్రం దర్శకుడు నిరాశ పరిచాడు. అయితే, సెకెండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తుంది . దీనికి తోడు మూవీ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. పాప కోసం సైంధవ్ చేసిన పోరాటంలో ఎమోషన్ ఉన్నా, ట్రీట్మెంట్ లో సరైన కాన్ ఫ్లిక్ట్ మాత్రం బిల్డ్ అవ్వలేదు.

ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. విలన్స్ – హీరో మధ్య వార్ కి లీడ్ ఇంకా బలంగా ఉండాల్సింది. మొత్తమ్మీద దర్శకుడు శైలేష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ మూవీ ని మలచలేకపోయారు. ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా వంటి మంచి నటీనటులు ఉన్నా.. వారికి తగ్గట్టు వారి పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ బాగుంది. అయితే, మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలం అయ్యారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాత వెంకట్ బోయనపల్లి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘సైంధవ్’ అంటూ వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. అలాగే, వెంకటేష్ గ్రేస్ అండ్ ఇమేజ్ మూవీ కి ప్లస్ అయ్యింది. కానీ, స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ మూవీ లో వెంకటేష్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. వెంకటేష్ ఫ్యాన్స్ ఓసారి చూడొచ్చు.