రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లక తప్పదు

రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లక తప్పదు

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నేతలు గురువారం కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దళితుల కోసం కేసీఆర్‌ రూ.55వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

అంతకముందు బుధవారం హైదరాబాద్‌ శివార్లలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో బుధవారం నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభలో రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ఎండగట్టిన సంగతి తెలిసిందే.