Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతోంది గౌహతి యవత. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ 20లో మనదేశం ఓడిపోయిందన్న ఆగ్రహంతో గౌహతిలో కొందరు యువకులు ఆసిస్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన తరువాత అసోం అభిమానుల వైఖరిపై భారత్ తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గౌహతి యువత దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమను క్షమించాలని విజ్ఞప్తిచేస్తోంది. క్రీడాకారులు బసచేసిన రాడిన్ బ్లూ హోటల్ ముందు వందలాది మంది యువతీ యువకులు క్షమాపణలు కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని, ఓ తుంటరి చేసిన పనికి రాష్ట్ర యువతంతా క్షమించాలని వేడుకుంటోందని వారు తెలిపారు. గౌహతి యువత తాజా వైఖరిపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. క్షమాపణలు చెప్పడం ద్వారా వారు ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.